మాఫోయ్! జరా మాఫ్ కర్నా

15 Jul
నలమోతు చక్రవర్తి గారి ఆధ్వర్యంలో APNRI సంస్థ శ్రీ కృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో ఈ వాక్యాలు రాసి ఉన్నాయి:
.
“రాజకీయ అస్థిరత, ఆందోళనకర వాతావరణం కారణంగా హైదరాబాద్‌లో ఐటి రంగంలో ఉపాధికల్పన గణనీయంగా తగ్గిపోయింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనలో మిగతా భారతీయ నగరాలతో పోల్చితే హైదరాబాద్ గత ఆరేడు నెలలుగా బాగా వెనుకబడి పోయిందని మాఫాయ్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్ సర్వేలో వెల్లడైంది.”
.
అబద్ధాలను ఎదుర్కోవడం తేలిక కానీ ఇలాంటి మాటల గారడీని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే.
.
ప్రఖ్యాత కన్సల్టింగ్ కంపెనీ మాఫోయ్ (Ma Foi) ఇటీవల దేశంలో ఉద్యోగ రంగంపై ఒక సర్వే నివేదిక విడుదల చేసింది. Ma Foi Randstad Employment Trends Survey పేరిట విడుదల చేసిన ఆ సర్వేలో భారత దేశంలోని 8 నగరాల్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉండబోతున్నాయో వివరించారు.
.
ఆ నివేదిక పూర్తి పాఠం ఇక్కడ చదవండి:
.
హైదరాబాద్ గురించి మాఫోయ్ నివేదిక రాసిన ఈ నాలుగు లైన్లు చదవండి.
.

.

ఎక్కడైనా “రాజకీయ అస్థిరత”, “ఆందోళనకర వాతావరణం”, “తెలంగాణ ఉద్యమం” అన్న మాటలు కనపడ్డాయా?

.

మరి నలమోతు గారేమిటి అంత పెద్ద కథ అల్లారు?

ఆ నివేదికలో తెలంగాణ గురించి ఏక వాక్య ప్రస్తావన వచ్చిన మాట నిజం. అదేమిటో కింద చదవండి.

…. disruption of economic activities in
support and opposition to the new state of Telengana, the
common economic agendas were not pushed to the back
bench.
.
పై లైన్లు చదువుతే ఒక విషయం స్పష్టమవుతుంది:
.
దేశ ఆర్ధిక వాణిజ్య రంగాలపై స్వల్ప ప్రభావం చూపిన వాటిల్లో తెలంగాణకు అనుకూలంగా వ్యతిరేకంగా (సమైక్యాంధ్ర) జరిగిన ఉద్యమాలను పేర్కొన్నారు.  చక్రవర్తి గారేమో హైదరాబాదుకు ఏమేమో జరిగిపోయిందని మాఫోయ్ నివేదిక చెప్పిందని కథలు అల్లుతున్నారు.

.

ఆగండాగండి!

ఇంకా ఉంది మన వాడి బాగోతం.

అదే నివేదికలో ఇచ్చిన గ్రాఫును చూడండి:

.

దీన్ని జాగ్రత్తగా చూస్తే అర్థం అయ్యేదేమిటంటే 2010 ఏప్రిల్ నుండి జూన్ మధ్య హైదరాబాద్ ఉద్యోగరంగం 4.77% పెరుగుతుందని అంచనా వేస్తే అది ముంబై లో 2.67%, కోల్ కతలో 3.27%, డిల్లీ (NCR)లో 4.21%, చెన్నైలో 2.04%, బెంగుళూరులో 3.66%, అహ్మదా బాద్ లో 4.58% పెరుగుదల ఉంటుందని చెప్పిందా నివేదిక. అంటే పై అన్ని నగరాల కన్నా హైదరాబాద్ లోనే ఉద్యోగ కల్పన రేటు ఎక్కువ ఉంటుందన్నమాట.

హమ్మ నలమోతు గారు, సూటూ, బూటూ వేసుకుని ఫోజిస్తే ఏదో చదువుకున్న పెద్దమనిషి అనుకున్నాం.  “తెలంగాణావాదులు చెప్పేవన్నీ అబద్దాలే” అంటూ గొంతుచించుకుని అరిచే  తమరు ఇలాంటి అబద్దాలు ఆడవచ్చునా? తప్పు కదూ!.